- రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా హెడ్ కానిస్టేబుల్ పై కేసు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ నెల 23న గాజుల్ పేట్ (బ్రహ్మపురి కాలనీ) కి చెందిన అనుసూజ రెడ్డి అలియాస్ అనుసూయ రెడ్డి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజు బాయి పై కేసు నమోదైంది. వివరాలలోకి వెలితే 2024 మే 20న బోప్పిడి అనుసూజా రెడ్డి అనే వృద్దురాలి ఇంటిలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 4 తులాల బంగారం, 45 తులాల వెండి చోరీ చేశారు. బాధితురాలు స్థానిక రెండోటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 96/2024 ఎప్ఐఆర్ నెంబర్ కింద చోరీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అనూసూజ రెడ్డి ఇంటికి వెళ్లిన మహిళా హెడ్ కానిస్టేబుల్ రాజుబాయి ఇంటికి వెళ్లి పరిచయం చేసుకుంది. కేసు విచారణ జరిగి సొత్తు రికవరీ కావాలంటే క్రైం ఇన్వేష్టిగేషన్ చేసే ఐడి పార్టీ పోలీసులకు డబ్బులు ఇస్తే సరిపోతుందని నమ్మించింది. అనూసుజ రెడ్డి నుంచి దఫాల వారిగా డబ్బులను తీసుకుంది. తరువాత సొంతగా అప్పులు కావాలని విడతల వారీగా ప్రామిసరీనోట్ తో పాటు బాండ్ పేపర్ రాసిచ్చి, చెక్కులు ఇచ్చి లక్ష రూపాయలను తీసుకుంది. విచారణ ఎక్కడి వరకు వచ్చింది. సొత్తు రికవరి, అప్పు తీసుకున్న డబ్బులు ఎమయ్యాయని ప్రశ్నించిన అనుసుజా రెడ్డి ప్రశ్నిస్తే కేసులు పెడుతానని బెదిరించి బూతులు తిట్టింది. దానితో బాధితురాలు పోలీస్ బాస్ కు ప్రజా వాణిలో ఫిర్యాదు చేయడంతో పోలీస్ లు మహిళా హెడ్ కానిస్టెబుల్ పై కేసు నమోదు చేశారు. రేపో మాపో మహిళా హెడ్ కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
