కామారెడ్డి, బతుకమ్మ : మందకృష్ణ మాదిగ 40ఏళ్ల ప్రజా జీవితంలో 30ఏళ్ల సామాజిక ఉద్యమాల త్యాగ ఫలితంగా ఆయనను పద్మశ్రీ వరించిందని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. అంటరాని జాతికి ఆత్మగౌరవ నేర్పిన నేత, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, విశాలాంధ్ర పెన్షన్ ప్రదాత, వృద్ధుల వితంతుల దిక్కై, తెలంగాణ అమరుల కుటుంబాల భరోసై, తెల్ల రేషన్ కార్డుల అన్నం మెతుకై.. ఆడబిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన మందకృష్ణ మాదిగకు సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ మహిళా రాష్ట్ర అధ్యక్షులు పసలడి బాలమణి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బట్ట వెంకట రాములు, పొట్టి గిని శంకర్, ఆర్.భాగయ్య, నడుపుల రామస్వామి, ఎర్ర శివరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
