ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిలకర సత్యనారాయణ స్కూల్ పిల్లలకు తన సొంత డబ్బులతో 10 బెంచీలు, అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 12 కుర్చీలు వితరణ చేశారు. అలాగే గ్రామ ఉపాధ్యక్షులు సందీప్ కుమార్ అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 12 పలకలు వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, గ్రామ పెద్దలు , యువకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు జిలకర సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తనని ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. ఇలా తన స్వగ్రామం లోని పాఠశాలలో పిల్లలకి స్కూల్ బెంచీలు, కుర్చీలు ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. పిల్లలందరూ బాగా చదువుకునీ మన ఊరికి అలాగే మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిలు, బత్తుల కిషన్, జక్కుల సాయిలు, బయ్యని ప్రవీణ్, చింతల రాజు, నాయికోటి నారాయణ, బయ్యాని ఇసాక్, చింతల బాలయ్య, జక్కుల పర్వయ, బయ్యని సుధయ్య, జక్కుల రాజు, బత్తుల పోచయ్య, దేవేందర్. గ్రామస్తులు తదితరులున్నారు.
