పోరాటాల త్యాగ ఫలితమే పద్మశ్రీ
కామారెడ్డి, బతుకమ్మ : మందకృష్ణ మాదిగ 40ఏళ్ల ప్రజా జీవితంలో 30ఏళ్ల సామాజిక ఉద్యమాల త్యాగ ఫలితంగా ఆయనను పద్మశ్రీ వరించిందని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. అంటరాని జాతికి ఆత్మగౌరవ నేర్పిన నేత, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, విశాలాంధ్ర పెన్షన్ ప్రదాత, వృద్ధుల వితంతుల దిక్కై, తెలంగాణ...