28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రజకులు చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలని మా లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన రజకులకు చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలని మా యొక్క లక్ష్యం అని జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులు చింతకుంట శంకర్ అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రజకులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ గా ఎన్నికైన శుభ సందర్భంగా  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గూపన్ పల్లి దీపక్ గార్డెన్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులు చింతకుంట శంకర్ మాట్లాడుతూ ..రజకులు రాజ్యాంగం ప్రసాదించిన రాజకీయ పదవులు ఉన్నంతగా రాణించాలని ప్రజల మెప్పు పొందాలని కోరారు.అనంతరం సర్పంచ్ గా గెలుపొందిన నాగపూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ గా గెలుపొందిన అన్సన్ పల్లి గంగాధర్, కృష్ణా, బాలయ్య, అన్నపూర్ణ, నరేష్ వార్డు సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు భరత్, చంద్రం, సాయిలు, కిషన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article