27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్ ఎస్ ఎఫ్ బోధన్ చక్కెర ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 నిజామాబాద్, బతుకమ్మ :

ఎన్ ఎస్ ఎఫ్ ఫ్యాక్టరీ హస్తం పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే తెరిపిస్తామని రైతులకు హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని ,కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫ్యాక్టరీ తెరిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఎ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో భూమయ్య విలేఖరులతో మాట్లాడుతూ…..ఎన్ ఎస్ ఎఫ్ ఫ్యాక్టరీ లే అప్ ప్రకటించి దశాబ్ద కాలం అయినా అటు బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఫ్యాక్టరీ తెరిపించే నిర్ణయంలో రైతులకు మొండి  చేయి మిగిలిందని భూమయ్య అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా సబ్ కమిటీ వేశారని ఆయన అన్నారు. ఆ సబ్ కమిటీ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను సందర్శించి తమ రిపోర్టును సైతం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అందులో చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ తెలిపారు అన్నారు. వీరితోపాటు బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి రైతుల అభిప్రాయాల కోసం ఎడపల్లి లో సమావేశాన్ని నిర్వహించారు దాంట్లో రైతులు కచ్చితంగా ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిపించేందుకు ముందుకు వస్తే మేము చెరుకు పండించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అన్నారు. ఇప్పటికైనా ఎన్ ఎస్ ఎఫ్, ఎన్సిఎస్ ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించి మీ మాటలు నిలబెట్టుకోవాలని వారు కోరారు. తెలంగాణలో సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్సిఎస్ ఎఫ్ సారంగాపూర్ ను తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వం నడిపించాలని భూమయ్య అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్  జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి. ఉపాధ్యక్షులు ఎల్ పర్వయ్య.బి. సాయిలు. విఠల్.పోశెట్టి.బి గంగాధర్. నరసయ్య. రేపని గంగాధర్. తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article