ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నేటి యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావము అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ప్రిన్సిపల్ డా. ఇ.లక్ష్మీ నారాయణ తెలిపారు. కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీలలో కళాశాల స్థాయిలో మొదటి స్థానం పొందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాలను విజ్ఞానం పెంపొందించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలన్నారు. పక్కదారి పట్టించే అంశాల జోలికి పోవద్దని, సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారితే అది మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఈ విషయమై కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. ఎం.చంద్రకాంత్, టీఎస్ కే సి ఇన్చార్జ్ శివకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎస్.చంద్రకాంత్, రాణి, సైన్స్ విభాగం ఇంచార్జ్ డా.బి. అరుణ్ కుమార్, అధ్యాపకులు శశిధర్, కృష్ణ ప్రసాద్, మోహిన్, మహముద్, దశరథ్ విద్యార్థులు పాల్గొన్నారు.
