28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వివాదాస్పద స్థలంపై సర్వే చేయాలని ఆదేశాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి)లో గల వివాదాస్పద స్థలం విషయంలో ల్యాండ్ సర్వే ఏడిని విచారణ చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో బోర్గాం(పి) గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సర్వే నంబర్ 586/1, 586/2 సర్వే  నంబర్ లలో  ఉన్న 1.21 ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాల క్రీడా స్థలం కోసం కేటాయించాలని కొన్ని రోజులుగా కోరుతున్నామని తెలిపారు. దశాబ్ధాలుగా సంబంధిత భూమి చెరువు శిఖం భూమిగా ఉందని తెలిపారు. గత  ప్రభుత్వ హయంలో దానిని ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అయితే గతంలో ఉన్న అధికార యంత్రాగం సంబంధిత భూమికి ఎన్ వోసి ఇవ్వడం వల్ల ఆ భూమి పట్టా భూమిగా మారిందని ఈ నేపథ్యంలో విచారణ జరిపి ఆ భూమిని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించాలని కోరారు. ఈ విషయంలో స్పందించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భూమిని సర్వే చేసి వివరాలు ఇవ్వాలని ల్యాండ్ సర్వే అధికారులకు సిఫారసు చేశారు.

More articles

Latest article