23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒకరిని అరెస్టు చేస్తే మరొకరు లొంగిపోయారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఐదో టౌన్ పోలీసులు 307 సెక్షన్ కింద ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా అతడి స్నేహితుడు తనను సైతం అరెస్టు చేస్తారనే భయంతో మహారాష్ర్టలో పోలీసులకు లొంగిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆటో నగర్ కు చెందిన బర్సాత్ ఆమేర్ ను ఈనెల 16వ తేదీన పోలీసులు 307 సెక్షన్ కింద అరెస్టు రిమాండ్ కు పంపించారు. విషయం తెలుసుకున్న మహారాష్ర్టలోని నాందేడ్ కు చెందిన అతడి స్నేహితుడు హరియా సైతం అక్కడి పోలీసుల వద్దకు వెళ్లి తనపై నిజామాబాద్ లో సైతం కేసులున్నాయని చెప్పి లొంగిపోయాడు. నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు హరియాను విచారించగా అతడి వద్ద కంట్రీమేడ్ గన్ తోపాటు బుల్లెట్లు లభ్యమయ్యాయి. హరియా తన స్నేహితుడైన బర్సాత్ ఆమేర్ కోసమే పోలీసుల వద్ద లొంగిపోయాడా? లేక తన అరెస్టు తప్పదని ఊహించి లొంగియాడా? అనేది చర్చకు దారితీసింది.

More articles

Latest article