23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యుత్ ఉద్యోగుల రక్తదానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. గోల్డెన్ జుబ్లీ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని ఎస్ ఈ రాపెల్లి రవీందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సంస్థ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బి ఆంజనేయులు, డీఈలు జాడే ఉత్తమ్, వెంకటరమణ, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్ నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, పీవో పోశెట్టి, విద్యుత్ జేఏసీ నాయకులు పి గంగాధర్, సురేశ్ కుమార్, గంగారాం నాయక్, ఎం అశోక్, కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, బాబా శ్రీనివాస్, నగేశ్ కుమార్, శివ, రఘు పాల్గొన్నారు. సుమారు 50 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.

Blood donation of electricity workers

More articles

Latest article