27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పీఆర్టీయూ ఎన్నికల్లో మరోసారి మోహన్ రెడ్డికే పట్టం

Must read

📰 Generate e-Paper Clip

  •  ప్రధాన కార్యదర్శిగా గంగోని కిషన్

బతుకమ్మ ,నిజామాబాద్ సిటీ : ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి పొద్దుటూరి మోహన్ రెడ్డి గెలుపొందారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన పి ఆర్ టి యు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. ప్రధానంగా అధ్యక్షుని రేసులో అధ్యక్షుని గా తాజా మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి ల మధ్య పోటీ కొనసాగింది. 195 ఓట్లకు గాను 188 మంది ఆఫీస్ బేరర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం నాలుగు రౌండ్ల పాటు కొనసాగిన ఓట్ల లెక్కింపులో కృష్ణారెడ్డి పై అత్యధిక మెజారిటీ మోహన్ రెడ్డి 137 ఓట్లతో జిల్లా అధ్యక్షునిగా గెలుపొందారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ముగ్గురు పోటీలో ఉండగా ఎం వెంకట గౌడ్, ఏ శంకర్లపై గంగోని కిషన్ 101 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Once again Mohan Reddy won the PRTU elections
అసోసియేట్ అధ్యక్షులుగా అంకం నరేష్, గంటా అశో క్ లు ఎన్నికయ్యారు. మహిళ అసోసియేట్ అధ్యక్షురాలిగా టీ .సరిత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చిలుక శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రఘువీర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ లు ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలుగా వరలక్ష్మి ఎంపికయ్యారు. కార్యదర్శులుగా గంగాధర్, కృష్ణమోహన్, రాజేశ్వర్, వేణు మాధవరావు, శ్రీనివాస్ లతో పాటు మహిళా కార్యదర్శిగా సుజాత ఎన్నికయ్యారు . పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన మోహన్ రెడ్డి ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారులు గెలుపొందిన వారికి నియామక పత్రాలను అందించారు. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Once again Mohan Reddy won the PRTU elections

More articles

Latest article