24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్: తెలుగు చలనచిత్ర నటుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతోత్సవం బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కమ్మ సంఘంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి అనుబంధంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, కమ్మ సంఘం, ఎన్టీఆర్ అభిమాన సంఘ కమిటీ అధ్యక్షులు శివన్నారాయణ, కమిటీ ప్రముఖులు, సభ్యులు, బిజెపి నాయకులు అడ్లూరి శ్రీనివాస్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు, పుష్పాక్షితలు వేసి వారికి ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో లెజెండరీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు వ్యాపింప చేసిన తెలుగు చలనచిత్ర నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ 102 వ జయంతి సందర్భంగా తన ఆహ్వానించినందుకు ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన సేవలు మరువలేమని అన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శివన్నారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా సుస్థిర పాలన అందించి నేటికి ప్రభుత్వాలు ఆచరించే దిశగా నిలుస్తున్నాయి అంటే కారకులు ఎన్టీఆర్ అని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తించి భారతరత్న అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో అవసరమని అందుకొరకై రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అభిమానులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారని, మీడియా ప్రతినిధి పల్నాటి చింటూ రక్తదానం చేయడం జరిగింది. అలాగే వారికి ప్రశంసాపత్రాలని అందజేయడం జరిగిందని, అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నామని, ఇందుకు సహకరిస్తు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ప్రముఖులు కృష్ణమోహన్ హరినాథ్ బాబు పావులూరి వెంకటేశ్వరరావు హనుమంతరావు, గోపాల్ రెడ్డి, విట్టల్, భాస్కర్, రఘు, శ్రీరామ్, మారుతి, శ్రీధర్ , శ్రీనివాస్ రంగారావు, రమేష్ బాబు, సచిన్ పటేల్ తదితరులు ఎన్టీఆర్ అభిమాన సంఘ ప్రముఖులు పాల్గొన్నారు.

More articles

Latest article