విత్తన దుకాణాల తనిఖీ

0 14,550

మోర్తాడ్,బతుకమ్మ: మోర్తాడ్ మండలం లోని విత్తన డీలర్ల షాప్స్ లను బుధవారం వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది. అనంతరం విత్తనాల డీలర్లతో ఆయన మాట్లాడుతూ ఈ అంశాలను జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిందిగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు షాప్ లైసెన్స్ ఎక్స్పెరిడేట్స్, తెచ్చిన ప్రతి విత్తనానికి ఇన్వాయిస్ కాపీ ప్రిన్సిపల్ సర్టిఫికెట్ తప్పనిసరి విత్తనానికి సంబంధించిన స్టాక్ బోర్డు స్టాక్ వివరాలు ఫిజికల్ స్టాక్, స్టాక్ రిజిస్టర్ లోని స్టాగ్ వివరాలు ఒకే విధంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, అన్ని లైసెన్సులకు సంబంధించిన రిజిస్టర్లను విధిగా మెయింటైన్ చేయాలని తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారితో సంతకం చేయించాలని పేర్కొన్నారు.ఎట్టి పరిస్థితుల్లో లూజు సీడ్ అమ్మ రాదని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు వచ్చిన స్టాకు స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి. అన్ని లైసెన్స్ లను కనబడే విధంగా డిస్ప్లే చేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, విత్తనా డీలర్లు దేవరాజ్, శ్రీనివాస్, మల్లేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.