రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయని పలువురు ప్రశంసిస్తున్నారు. రుద్రూర్ గ్రామంలో బైండ్ల గంగాధర్, బుడ్డోల్ల ఎల్లయ్య ఇద్దరి ఇండ్లు వర్షానికి దారుణంగా ఊరుస్తున్నాయి. ఇంటిపైన కప్పుకోవడానికి పట్టాలు కావాలని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షుడు హరి కృష్ణను ఆశ్రయించగా, వెంటనే బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కోనేరు శశాంక్ బాధితుల ఇండ్లకు టార్పాలిన్ పట్టాలు ఇప్పించారు. వీటిని సోమవారం బాధిత కుటుంబానికి బిజెపి నాయకులు టార్పాలిన్ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు అలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, బేగరి వినోద్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
