24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సీపీఎస్‌ అంతం పీఆర్‌టీయూ టీఎస్‌ పంతం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : ప్రభుత్వ ఉద్యో గుల, ఉపాధ్యాయుల పట్ల శా పంగా మారిన సీపీఎస్‌ విధా నం రద్దుఅయ్యేంత వరకు పీ ఆర్‌ టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని పిఆర్టియు బిచ్కుంద మండల మాజీ అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్‌టీ యూటీఎస్‌ ఆధ్వర్యంలో సీపీఎస్‌ విధానం అం తం కోరుతూ చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్య క్రమంనకు సోమవారం ఉదయం ఉపాధ్యాయులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు. సెప్టెంబరు 1న పెన్ష న్‌ విద్రోహ దినంగా పేర్కొంటూ పిఆర్టియు ఆధ్వర్యంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని నిర్వహిస్తున్న చలో హైదరాబా ద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఇర్షాద్ అలీ, గడ్డం ఆంజనేయులు, ఎన్ గంగారం, అహ్మద్, ఆన్సర్, ఎం శంకర్, విజయ్ కుమార్, వెంకట్, ఆర్ సంతోష్, పండరి, కిషన్, నయీం, క్రాంతి కుమార్, అర్జున్, ప్రమోద్, రామిరెడ్డి, శ్రీకాంత్, కిషన్, శ్రీధర్ గౌడ్, జె కిరణ్, దత్తు, మల్లారెడ్డి, సంజీవరెడ్డి, భూషణ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article