27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హైదరాబాద్ తరలిన పిఆర్ టియు నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల; రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకుసిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఏర్గట్ల మండలంలోని 35 మంది ఉపాధ్యాయులు  పెద్ద ఎత్తున హైదరాబాద్‌ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి బయలుదేరారు. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ ,వర్షపు ఇబ్బందులు ఉన్నప్పటికీ  ఆరోగ్యం సహకరించకపోయినా తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు ఐక్యంగా ముందడుగు వేసి పిఆర్ టియు సంఘం చేపట్టిన ధర్నా కు హాజరవుతూ ఉపాధ్యాయుల భవిష్యత్తు భద్రత కోసం సిపిఎస్ రద్దు తప్పనిసరి అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ  ముందు కదిలారు. ఈ సందర్భంలో ఏర్గట్ల మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల త్యాగస్ఫూర్తిని ప్రశంసిస్తూ,CPS ఉపాధ్యాయుల పోరాటానికి OPS ఉపాధ్యాయులు సైతం ముందడుగు వేసి ధర్నాకు రావడం అన్ని విధాలుగా వారి మద్దతు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ మన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిలబడితేనే విజయం సాధ్యం అని  తెలియజేస్తూ చివరిగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి  చెప్పిన విధంగా సిపిఎస్ రద్దుకు ఇదే చివరి ధర్నా అని కచ్చితమైన ధీమాను వ్యక్తం చేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి సహకరించిన మండల ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article