27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నింబాచల లక్ష్మీనర్సింహా స్వామి హుండీ లెక్కింపు

Must read

📰 Generate e-Paper Clip

. . . రెగ్యులర్ హుండీ ద్వారా. రూ.14,85,742

. . . అన్నదాన హుండీ ద్వారా రూ.6,06,315

భీమ్ గల్, బతుకమ్మ : 

 

భీంగల్ మండలం లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల దరిమిలా హుండీ ఆదాయం ను శుక్రవారం లెక్కించారు.  ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం భక్తులు సమర్పించిన కానుకల హుండీలను భీంగల్ లోని గ్రామాలయానికి తీసుకొని వచ్చారు.  ఎండోమెంట్ అబ్జర్వర్ కమలమ్మ, ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథిల సమక్షంలో హుండీని తెర్చి హుండీ ఆదాయాన్ని మహిళా భక్తుల చేత లెక్కింపు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు హుండీల లెక్కింపు కొనసాగింది. రెగ్యులర్ హుండీ ద్వారా రూ.148,5,752, అన్నసత్రం హుండీ ద్వారా 6,06,315 ఆదాయం వచ్చింది. లెక్కించిన హుండీ ఆదాయం ఎండోమెంట్ అధికారులు  ధ్రువీకరించి, స్థానిక ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేసేందుకు ఆలయ ధర్మకర్తకు అప్పగించారు.  హుండీ నగదు తో పాటు 670 గ్రాముల మిశ్రమ వెండి, 13 గ్రాముల మిశ్రమ బంగారం వచ్చినట్టు అధికారులు తెలిపారు.అట్టి వెండి, బంగారంను అధికారులు సీజ్ చేసి స్వామి వారి ఆభరణాలు భద్రపరిచే బ్యాంకు లాకర్ కు పంపినట్లు వెల్లడించారు.ఈ రెగ్యులర్ హుండీ, అన్నదాన హుండీల్లోవచ్చిన ఆదాయం లో బ్రహ్మోత్సవాలకు ముందు రెండు నెల ఆధాయం కూడా ఉందని అధికారులు, ధర్మకర్త తెలిపారు.

 

More articles

Latest article