ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గ్రామ అభివృద్ధి కమిటీ (విడిసి) అధ్యక్షునిగా బచ్చేవాల్ నవ భోజరాజ్ ఆదివారం ఎన్నికయ్యారు. పెర్కిట్ క్షత్రియ సమాజ్ లో ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్న నవభోజరాజ్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పెర్కిట్ లోని క్షత్రియ సమాజ్ కు చెందిన వ్యక్తి వీడిసి అధ్యక్షునిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వీడీసీ అధ్యక్షునిగా ఎంపికైన భోజ రాజ్ ను పెర్కెట్ లోని క్షత్రియ సమాజ్ భవన్ వద్ద పూలమాలలు, శాలువాతో సమాజ్ అధ్యక్షుడు గట్టడి నారాయణ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్ కార్యదర్శి కర్తన్ రాజ్ కుమార్, కోశాధికారి గట్టడి ప్రవీణ్, సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.
