24 C
Hyderabad
Sunday, August 2, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక నిజామాబాద్  లోని డిఆర్ఆర్ ఫామ్ హౌస్ లో మోడ్రన్ హై స్కూల్ ఖలిల్వాడి 2003- 2004 ఎస్సస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.  ఆ బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్యన జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు తమ చిన్ననాటి విద్యా దశ జ్ఞాపకాలు ఉపాధ్యాయులతో పంచుకున్నారు. ఆటపాటలు ఆడి వారి ఐక్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్థాయిలో రాణించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయ బృందాన్ని సన్మానించి కానుకలు అందజేశారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఒకరు స్పందిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు జీవితాంతం పదిలంగా ఉండే జ్ఞాపకాలని, విద్యాదశలో నేర్చుకున్న వివిధ నైపుణ్యాలు జీవితంలో పనికొచ్చే విధంగా ఉన్నాయని ఈ అభివృద్ధి తమ ఉపాధ్యాయుల బోధన వల్ల జరిగిందని తెలియజేశారు.

More articles

Latest article