27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని  చాటుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

National Voters' Day celebrated

National Voters' Day celebrated

More articles

Latest article