27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఈఎపి సెట్ ఫలితాల్లో నారాయణ ప్రభంజనం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆదివారం విడుదలైన ఈఎపి సెట్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పల్లెర్ల విరాజ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ లో 729వ ర్యాంకు సాధించి జిల్లా లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో దేశ్ ముఖ్ అథర్వ్ 3819, బోగా శ్రీ చరణ్ ఆదిత్య 5822, టి.సిద్ది 7185, బోగ ఓం సాయి మహంతా 10858 ర్యాంకులు సాధించారు. అలాగే ఫార్మా విభాగంలో అతీబ్ పర్వీజ్ 1402, ఆర్యన్ జాదవ్ 9212, కె.ఐశ్వర్య 12753, పి.హర్షిణి 13992, ఎస్.అక్షిత 19761 ర్యాంకులు సాధించినట్టు ఎస్ ఆర్ కాలేజ్ ఏజీఎం లక్ష్మారెడ్డి తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులని ఆయన అభినందించారు. ఏవరేజ్ స్టూడెంట్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం వల్లే ఇలాంటి ర్యాంకులు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. ఈ ర్యాంకులు సాధించడానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులను, అధ్యాపకులను ఆయన అభినందించారు.

 

Narayana Prabhanjanam tops EAP SET results

More articles

Latest article