24 C
Hyderabad
Sunday, August 2, 2026

రాకపోకలు పునరుద్ధరించిన సదాశివనగర్ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉట్నూర్ గ్రామంలో రోడ్డుపై భారీ చెట్టు కూలిపోవడంతో శుక్రవారం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే సదాశివనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో రోడ్డుపై పడిన చెట్టును వేగంగా తొలగించారు. అనంతరం రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనతో ప్రజలకు సేవలందిస్తున్న కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ విధి నిర్వహణలో నిబద్ధతను చాటిచెప్పారు. స్థానికులు పోలీసుల తక్షణ స్పందనను అభినందించారు.

 

Sadashivanagar police restored traffic movement.

More articles

Latest article