28.9 C
Hyderabad

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఛత్తీస్ ఘడ్, బతుకమ్మ : ఛతీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. 24గంటల్లో రెండోసారి ఎదరు కాల్పులు జరగడంతో దండకారణ్యంలో ఉద్రక్తత చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు, శాంతి చర్చల ప్రతినిధి అలియాస్ గౌతం అలియాస్ సుధాకర్ గురువారం మరణించగా, శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కొమ్రం భీం, మంచిర్యాల ఏరియా కమిటీ కార్యదర్శి మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మరణించినట్లుగా బీజాపూర్ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర్లకు చెదిన ఆడెల్లు 1995 నుంచి సాయుధ పోరాటం వైపు  అడుగులు వేశారు. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పీపుల్స్ వార్ పార్టీలో పని చేసిన భాస్కర్ దండకారణ్య అటవీ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ గత వైభవం కోసం పని చేశారు.

More articles

Latest article