27.7 C
Hyderabad

అమీనాపూర్ లో ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులతో అదృశ్యమైన సంఘటన స్థానికంగా మండలంలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఈనెల 25 న ఇంట్లో వారితో చెప్పి తన ఇద్దరు పిల్లలతో కలిసి వేల్పూర్ కు బయలుదేరింది. 8  ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి వెళ్లిన ఆమె ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఆమె కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More articles

Latest article