బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన
వెబ్ న్యూస్, బతుకమ్మ : కర్ణాటకలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. సుమారు రూ.7,160 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ను ప్రధాని ప్రారంభించారు. మరో 3 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రూ.16,610 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రధాని మోదీ, సీఎం సిద్దరామయ్య కేంద్ర మంత్రులు కలిసి ప్రయాణించారు.

