Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 12:58 pm Posted by : ramakrishna

మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ, సీఎం సిద్దరామయ్య

బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన

వెబ్ న్యూస్, బతుకమ్మ : కర్ణాటకలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. సుమారు రూ.7,160 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ను ప్రధాని ప్రారంభించారు. మరో 3 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  రూ.16,610 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.  రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రధాని మోదీ, సీఎం సిద్దరామయ్య కేంద్ర మంత్రులు కలిసి ప్రయాణించారు.

Modi, CM Siddaramaiah travel in Metro train