. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. గంగాస్థాన్ ఫేజ్-1లో కొనసాగుతున్న పనులతోపాటు మురుగునీటి శుద్ధీకరణ ప్లాట్ ను ప్రజారోగ్యశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందూర్ కార్పొరేషన్ కు అమృత్ -2 కింద భూగర్భజలాల అభివృద్ధి, వాటర్ వర్క్స్ పనుల కొసం సుమారు రూ.400 కోట్లు విడుదలయ్యాయన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల్లో భాగంగా 150 మ్యాన్ హోళ్ల పునర్నిర్మాణంతోపాటు 45 కొత్తగా నిర్మించినట్లు తెలిపారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరత గతిన పూర్తి చేయాలని, పనులను నాణ్యతతో పూర్తి చేయాలనీ అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. ఎమ్మెల్యే వెంట డీఈ నగేశ్ రెడ్డి, సాయి చంద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, బీజేపీ కంఠేశ్వర్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, నాయకులు సాయి ప్రవీణ్, మఠం పవన్, ఆనంద్, నాయకులు, తదితరులున్నారు.
