అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ పనులపై ఎమ్మెల్యే అసహనం

. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. గంగాస్థాన్ ఫేజ్-1లో కొనసాగుతున్న పనులతోపాటు మురుగునీటి శుద్ధీకరణ ప్లాట్ ను ప్రజారోగ్యశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందూర్ కార్పొరేషన్ కు అమృత్ -2 కింద భూగర్భజలాల అభివృద్ధి, వాటర్ వర్క్స్ పనుల కొసం సుమారు రూ.400 కోట్లు విడుదలయ్యాయన్నారు....