29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ పదవులు

Must read

📰 Generate e-Paper Clip

. 2017కు ముందు పార్టీలో ఉన్న వారికే పదవులు

. కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సమావేశాలు

. కార్యకర్తగా జిల్లాకు వచ్చా

. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ, సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాకు కార్యకర్తగా వచ్చానని, అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ పదవులు దక్కేలా సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని డిచ్ పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించగా ముఖ్య అతిథులుగా బల్మూరి వెంకట్ తోపాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఐసీసీ అధ్యక్షుడు ఖర్గే , ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారిని అబ్జర్వర్లుగా నియమించారని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను కలుపుకుని మే 4 నుంచి 10 తేదీ లోవరకు సమావేశాలు నిర్వహిస్తామని, కష్టపడిన వారిని పార్టీ గుర్తిస్తుందని స్పష్టం చేశారు. మండల అధ్యక్షులుగా 5 పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా 3 పేర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 5 పేర్లు తీసుకుంటామని, 2017 కన్నా ముందు పార్టీలో ఉన్నారో వారికే ముందు అవకాశం ఉంటుందని బల్మూరి స్పష్టం చేశారు.


Party positions for those who worked hard in the assembly elections

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం ఇచ్చినప్పుడే ప్రజానాయకులమవుతామని, పదవుల కోసం పాకులాడొద్దని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ జిల్లాకు చేసిందేమీ లేదని ఈ విషయాన్ ప్రజలకు చెప్పాలని సూచించారు. తానున మంత్రి ఉన్న సమయంలో ప్రజలకు తాగు, సాగు నీరు అందాలని కాళేశ్వరం ప్యాకేజీ 21,22, 23 తీసుకువస్తే దాన్ని వారి స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. చిన్నచిన్న విషయాలను వివాదాస్పదం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని స్పష్టంచేశారు.

సమావేశంలో జై బాపు జై భీం జై సంవిధాన్ బోధన్ అర్బన్ ఇన్ చార్జి సత్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రా ష్ట్ర విత్తనబివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్, అరికెలా నర్సారెడ్డి, ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, జావెద్ అక్రమ్, నాయకులు,కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More articles

Latest article