30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఊషూ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  •  ప్రతిభ కనబరచిన పోచంపాడు లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థులు

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ, స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఊషూ రాష్ట్ర స్థాయి’ క్రీడా ముగింపు పోటీలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ పోటీలలో నిజామాబాదు జిల్లా పోచంపాడు లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక్కరోజు ‘ఊషూ రాష్ట్ర స్థాయి’ 7వ క్రీడా పోటీలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని యువతి,యువకులు అధిక సంఖ్యలో పాల్గోని క్రీడాను విజయవంతం చేసినందుకు ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు కె.గంగాధర్, అంజయ్య కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి, బీజేవైయం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్ధ రమేష్, ఏలేటి గంగారెడ్డి, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు మోతె గంగారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్, మల్లేష్ గౌడ్, టి.సాయన్న, సామ వెంకట్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, జోగు నర్సయ్య, సంజీవ్ థామస్, యువజన సంఘం నాయకులు మధుకర్, సాయిలు, గంగారాజ్, హరీష్, ముస్కు శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article