నిజామాబాద్ సిటి, బతుకమ్మ : సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, నూడా చైర్మన్ కేశ వేణు ను జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ కార్యవర్గం శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిరాష్ట్ర ఉపాధ్యక్షులు గదారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సెపక్ తక్రా అధ్యక్షులు కేశ వేణు నూడా చైర్మన్ కావడం సంతోషాకరమని, అయన మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలని అన్నారు. అలాగే త్వరలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆ సన్మాన కార్యక్రమం లో రాష్ట్ర కమిటీ సభ్యులుసెపక్ తక్రా జాతీయ క్రీడాకారులుజిల్లా క్రీడాకారులు పాల్గొంటారని సంజీవరెడ్డి తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం లో జిల్లా సెపక్ తక్రా ఉపాధ్యక్షలు గడ్డం సతీష్ రెడ్డి,ల్యాబ్ గంగారెడ్డి,లీగల్ అడ్వైసర్ నల్ల సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
