పీడీఎస్ మాఫియాతో  రైస్ మిల్లర్ల మిలాఖత్

0 2,564

.  మహలక్ష్మి ఇండస్ర్టీస్ పై పిడిఎస్ మాఫియా దాడితో బట్టబయలు

.  బకాయి డబ్బుల కోసం మిల్లర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నం

.  8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు

.  మిల్లర్ పై పౌర సరఫరాల శాఖ చర్యలేమిటో..?

చేసేదే దొంగ వ్యాపారం.. అందులో మళ్లీ ఆధిపత్యం కోసం ఆరాటం, బకాయిల వసూళ్ల కోసం బెదిరింపులు, ఒకరిపై మరొకరి నిఘా.. ఫిర్యాదులు, దాడులు. ఇవన్నీ రేషన్ బియ్యం (పీడీఎస్) అక్రమదందాలో మామూలు విషయాలుగా మారిపోయాయి. ఆర్మూర్ రోడ్డులోని మహాలక్ష్మి రైస్ మిల్లువద్ద పీడీఎస్ బియ్యం లోడ్ తో వాహనం పట్టుబడిన విషయం తెలిసిందే. రైస్ మిల్లర్ తనకు బకాయిలను చెల్లించడం లేదని పీడీఎస్ బియ్యం దందా చేసే వ్యక్తి పట్టించాడు. ఈ ఘటన పీడీఎస్ మాఫియా, రైస్ మిల్లర్లు మిలాఖత్ అయ్యారనేదానిని మరోసారి రుజువు చేసింది.

 నిజామాబాద్ , బతుకమ్మ:  పీడీఎస్ బియ్యం మాఫియాతో రైస్ మిల్లర్ల బంధం పెనవేసుకుపోయిందనేందుకు రైస్ మిల్లుల్లో పట్టుబడుతున్న బస్తాలు, లారీలే నిదర్శనం.  నిజామాబాద్- ఆర్మూర్ జాతీయ రహదారీలో ఉన్న మహలక్ష్మీ ఇండస్ర్టీస్ నిర్వాహకులకు పీడీఎస్ మాఫీయాతో ఎప్పటి నుంచో లావాదేవీలు నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన సుమేర్ అనే పీడీఎస్ దందా నిర్వహకుడికి మహలక్ష్మీ ఇండస్ర్టీస్ యజమాని లక్షల్లో బకాయి పడ్డారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా నిజామాబాద్ కు చెందిన షహ బాజ్ అనే అనే కొత్త వ్యక్తి వద్ద పీడీఎస్ బియ్యం తీసుకుని రిసైక్లింగ్ చేస్తున్నట్లు సుమేర్ తెలుసుకున్నాడు. రైస్ మిల్ యజామాని వద్ద బకాయిల విషయమై ఇప్పటి వరకు చాలాసార్లు పంచాయితీలు జరిగినా వ్యవహారం కొలిక్కి రాలేదు. దీంతో పీడీఎస్ దందా చేస్తున్న ఎనిమిది మంది మహాలక్ష్మీ ఇండస్ర్టీస్ పై కన్నేసి  ఉంచారు. మంగళవారం డీసీఎంలో 30 టన్నుల పీడీఎస్ బియ్యం మహాలక్ష్మి  ఇండస్ట్రీస్ కు వచ్చిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారా? లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలా.. అని గుమాస్తాను నిర్బంధించిచి కొట్టడంతో పాటు యజమానిని బెదిరించారు. అయన నేరుగా పోలిస్ లకు ఫిర్యాదుచేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది.

ఎనిమిది మందిపై కేసు నమోదు..

పీడీఎస్ నిర్వాహకులు ఎనిమిది మందిపై పోలీసు శాఖ కేసులు నమోదు చేయడంతోపాటు సివిల్ సప్లైశాఖకు సమాచారం అందించారు. రైస్ మిల్లులో ఏ మేరకు రేషన్ బియ్యం ఉందనే కోణంలో అ శాఖాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. రేషన్ దందాలో ఆధిపత్య పోరు కోనసాగుతుండగా, మిల్లర్లతో విభేదాలు వారిద్ధరి రహస్య దందాను గుట్టు రట్టు చేసింది. దీంతోపాటు 8 మంది పీడీఎస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు పీడీఎస్ దందా కు సహకరిస్తున్న మిల్లర్ పై సివిల్ సప్లై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మిల్లర్లు, పీడీఎస్ దందా చేసే వారు వేరు కాదని మహలక్ష్మీ ఇండస్ర్టీస్  ఉదంతం బహిర్గతం చేసింది. జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. సీఎంఆర్ కోసం రిసైక్లింగ్ దందా చేస్తున్న మిల్లర్ కు వానా కాలం బియ్యం కేటాయింపులు జరుగుతాయా అనే చర్చ జరుగుతోంది.

బంధానికి బీటలు..

పీడీఎస్ మాఫియా, రైస్ మిల్లర్ల మధ్య బంధానికి బీటలు వారాయి. అందుకు డబ్బుల చెల్లింపులో వచ్చిన విభేదాలు ఓ కారణం కాగా, దందాలో ఇతరుల ఎంట్రీని పీడీఎస్ మాఫియా జీర్ణించుకోవడం లేదు. రెండేళ్లలో పీడీఎస్ దందాకు అడ్డం వచ్చిన ఇద్ధరు రౌడిషీటర్లను మట్టుబెట్టించింది. ఇప్పుడు పీడీఎస్ బియ్యం తీసుకునే రైస్ మిల్లర్లు అనుకున్న ధర చెల్లించపోయినా, సకాలంలో డబ్బులు ఇవ్వకపోయినా బ్లాక్ మెయిల్కు దిగడంతోపాటు బెదిరింపులకు వెనుకాడటం లేదు.

milakhat-of-rice-millers-with-pds-mafia

Leave A Reply

Your email address will not be published.