27.4 C
Hyderabad

మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి రాంసింగ్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ  చేశారు. మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందా లేదా అని పరిశీలించి విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ షాదుల్, మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, మాజీ కో అప్షన్ సభ్యులు దస్తగిర్, వార్డు సభ్యులు లింగం గౌడ్, అలీం ఖాన్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article