27.4 C
Hyderabad

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమ్ (ఆర్బిఎస్కె) ఆధ్వర్యంలో శుక్రవారం రుద్రూర్ మండలం అంబం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు  నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్ బిఎస్ కె డా. అరవింద్  మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత (హైజీన్), పౌష్టికాహారం తీసుకోవడం ప్రాముఖ్యత గురించి పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంబం గ్రామ సర్పంచ్ కూర్లేపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లె సాయి ప్రసాద్, అరవింద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మనోజ్ ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article