27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వైద్య సిబ్బందికి మెమోలు

Must read

📰 Generate e-Paper Clip

. ఇందల్వాయి పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 

ఇందల్వాయి, బతుకమ్మ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసిన కలెక్టర్.. పలు లోపాలను గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి, సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని తన వెంట ఉన్న డీఎంహెచ్ వో డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబ్ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానానికి సంబంధించిన వివరాలను టెక్నిషియన్ తో మాట్లాడి తెలుసుకున్నారు. ఓపీ, ఇన్ పేషంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఔషధాలను నిల్వ చేసేందుకు ఉపయోగించే ఫ్రిడ్జ్ లను వినియోగించకుండా వృథాగా మూలన పడేయడాన్ని గమనించిన కలెక్టర్ పీహెచ్ సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఫ్రిడ్జ్ లు చెడిపోతే తక్షణమే వాటికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని, జిల్లాలోని అన్ని పీహెచ్ సీలలో ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ వోను ఆదేశించారు. పీహెచ్ సీల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులున్నారు.

More articles

Latest article