27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మీనాక్షిది జన హితయాత్ర కాదు, జనరహిత యాత్ర

Must read

📰 Generate e-Paper Clip

  • జనం లేక మీనాక్షి పర్యటన వెలవెల
  • ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి పై కేకలేసిన పీసీసీ చీఫ్
  • బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టింది జన హిత పాదయాత్రయాత్ర కాదని, అది జన రహిత పాద యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనం లేక  మీనాక్షి పర్యటన వెలవెల బోతోందన్నారు. మీనాక్షి పాదయాత్ర కు ప్రజాస్పందన కరువుకావడంతోపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, జన సమీకరణ కోసం నడబ్బులు పంపాను కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి పై కేకలేసిన పీసీసీ చీఫ్ తాను పంపిన డబ్బులు పంచలేదా అని రుసరుసలాడారని, మైక్ లో పీసీసీ అధ్యక్షుడి మాటలు విని అంతా షాక్ అయ్యారని ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ఎన్ని హామీలను అమలు చేసిందో ఆర్మూర్ నియోజకవర్గలో పాదయాత్ర చేస్తున్న  మీనాక్షి నటరాజన్ సిద్దులగుట్ట శివన్న సాక్షిగా నిజం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్  తెలంగాణ లో ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు. గాంధీ ఫ్యామిలీ సాగిస్తున్న బానిసత్వ రాజకీయానికి తెలంగాణ ను ప్రయోగశాలగా మార్చుకున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నీతులు వల్లించే రాహుల్ గాంధీ తెలంగాణ లో మాత్రం రాజ్యాంగా న్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ ను డమ్మీ సీఎంను చేసి ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటు న్నారని, మీనాక్షి నటరాజన్ ను షాడో సీఎం ను చేసి తెలంగాణలో తిప్పుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే 50 సార్లు ఢిల్లీ వెళ్లి గాంధీ ఫ్యామిలీకి భజన చేస్తూ తెలంగాణ కోసం ఇంత బూందీ కూడా తేలేకపోయిన రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ దర్శనం కూడా జరగడం లేదన్నారు. ఇక మీనాక్షి  పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. మాటల్లో గాంధేయవాదం, చేతల్లో గాడ్ సే వాదం అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో ఆర్మూర్ రైతులపై పోలీసుల దాస్టీకాలు కొనసాగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేసి పాదయాత్ర చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన మొత్తం 420 హామీలలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ’వరంగల్ రైతు డిక్లరేషన్ కు ఉప్పు పాతరేసింది నిజం కాదా?. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమాలోకి పోలేదా?. ఇంకా  20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాని విషయం వాస్తవం కాదా?. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 2లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం పాదయాత్ర సందర్భంగా మీ దృష్టికి రాలేదా?. రూ. 15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి మాటతప్పలేదా?. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తామని ముఖం చాటేయలేదా?. వరి పంటకు ప్రతీ క్వింటాలుకు రూ.500బోనస్ ఇస్తామని నమ్మబలికి మొండి చెయ్యి చూపలేదా?. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ఆశపెట్టి వారి కడుపుకొట్టలేదా?. కేసీఆర్  రైతు బంధు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలిస్తే,  డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసి వారికి వెన్నుపోటు పొడవలేదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. ఆసరా పెన్షన్లు పెంచి రూ.4వేల చొప్పున ఇస్తామన్న హామీ ఏమైంది?. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని బుట్ట దాఖలా చేయలేదా?. ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా?. మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని తుంగలో తొక్కలేదా?. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారు?. కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా?. ఎన్నికల హామీలు అమలు చేస్తామని సిద్ధులగుట్ట శివన్న సాక్షిగా సీఎం రేవంత్ ఒట్టేసి చెప్పి మాట తప్పలేదా?. డమ్మీ సీఎం రేవంత్ పై ప్రజలకు ఏమాత్రం నమ్మకంలేదు, కనీసం షాడో సీఎంగా తెలంగాణపై పెత్తనం చేస్తున్న మీరైనా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని ప్రజలకు మాటివ్వగలరా?. అసలు ఎవరి కోసం మీ జనహిత పాదయాత్ర?, జనంపై ఎందుకీ దండయాత్ర?. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఉందని మీకు ఒక్కరైనా చెప్పారా?. నిజామాబాద్ జిల్లాను ముంచుతున్న ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల పై మీరు స్పందించరా? అని జీవన్ రెడ్డి నిలదీశారు. 420 దొంగ హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు.

  • పీసీసీ అధ్యక్షుడు రోత మాటలు మానుకోవాలి..

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  రోత మాటలు మానుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ పడేళ్లపాలనపై పచ్చి అబద్దాలు చెబుతూ కేసీఆర్ పై, కేటీఆర్ పై విషం కక్కితుండని ఆయన మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ కు నీళ్లపై నాలెడ్జ్ నిల్. పాలన గురించి తెలియదు. సబ్జెక్ లేక గాలినంత పోగేసి కామెడీ షో చేస్తుండు అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్  చెప్పడం పెద్ద జోక్ గా అభివర్ణించారు.-కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే అభివృద్ధి లో తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ గా ఎలా నిలుస్తుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అని పీసీసీ అధ్యక్షుడు అనడం మరో పెద్ద జోక్ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ ఓ వైపు చంద్రబాబు, మోడీ భజన చేస్తుంటే మహేష్ కుమార్ గౌడ్  తెలంగాణ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్ అవినీతి గురించి మాట్లాడటం దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుంద న్నారు. సీఎం రేవంతే పెద్ద అవినీతి భూతం. కాంగ్రెస్ దోపిడీ తెలంగాణకు శరాఘాతం. పీసీసీ అంటేనే ప్రదేశ్  కరెప్షన్ సెంటర్. కాంగ్రెస్ డీ.ఎన్. ఏ లోనే కరప్షన్ ఉంది. పంచభూతాలనే భోంచేసిన పాపాల పుట్ట. ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్,శాండ్, మైన్, వైన్ మాఫియా. ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా నేషనల్ కరప్షన్ పార్టీ. ఏ టూ జెడ్ కాంగ్రెస్  కరప్షన్ కహానీలే అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అమాత్యులంతా అవినీతి అనకొండలేనని, ఆమ్యామ్యాలు లేనిదే ఫైళ్లు కదలవని ప్రతీ మంత్రి పేషీలో ఇదే తంతు అని, సచివాలయమంతాఅవినీతి కంపు కొడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలననని మంత్రి కొండా సురేఖ  ఆ మధ్య  ప్రభుత్వం లో అంతులేని అవినీతి ఉందని సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు కొత్తగా నీతులు చెబితే నమ్మేదెవరు? అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Meenakshi is not a public interest pilgrimage, but a public unwelcome pilgrimage.

More articles

Latest article