29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మిక వర్గ పోరాటాలకు మార్గదర్శి మార్క్స్ ఆలోచనలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ ఎస్ పి) ఆధ్వర్యంలో మార్క్సిస్టు సృష్టికర్త కార్ల్ మార్క్స్  జయంతి ఘనంగా నిర్వహించారు. ఆర్ ఎస్ పి పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, కారల్ మార్క్స్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడని, ఆయన సిద్ధాంతం ఈ రోజుకీ సమకాలీన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలను, దోపిడీ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మార్క్స్ చూపించిన మార్గం ఎంతో ఉపయోగకరమైనవి ఆయన పేర్కొన్నారు.కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం సామాజిక సమానత్వం ద్వారా సాధ్యమని, మార్క్స్ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.మార్క్స్ ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలని, యువత ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేసి సామాజిక మార్పు కోసం ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోపాల్ సింగ్ ఠాగూర్, సయ్యద్ ఇర్ఫాన్, టి కృష్ణ, షాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article