31.9 C
Hyderabad

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

Today is Teachers' Day.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 110 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు

 

. . . నేడు విద్యాశాఖ అధ్వర్యంలో అవార్డుల ప్రధానం

 

 నిజామాబాద్, బతుకమ్మ:

 

నిజామాబాద్ విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణకు ఎర్పాట్లు చెసింది. సాధరణంగా సెప్టెంబర్ 5న (దివగంత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాదాక్రిష్ణన్ జయంతి)న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం సర్వ సాధరణంగా జరుగుతుంది. కాని ఈ సారి విద్యాశాఖ నెల రోజులు ఆలస్యంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణకు సిద్ధం చేసింది. జిల్లాలో సర్కారు బడులలో బోదన చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ఆలస్యం అవ్వడంతో పాటు, జిల్లా కలెక్టర్ సెలవులో ఉండటంతో విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ సిరియస్ గా తీసుకో లేదనే వాదనలు ఉన్నాయి. కాని సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణకు అధికార యంత్రంగాం, విద్యాశాఖ సమాయాత్తమైంది..

 . . . సెంచరీ దాటిన ఉత్తమ ఉపాధ్యాయులు

నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు  సెంచరీ దాటారు. 40 మంది ఎస్జీటీలు, 40 మంది స్కూల్ అసిస్టెంట్లు, 10 మంది పీజీ హెడ్ మాస్టర్లు, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులు మొత్తం 110 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతలుగా ఎంపిక చేసింది విద్యాశాఖ. ప్రతి సారి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపికకు దరాఖాస్తులు స్వీకరించేవారు. కాని ఈ సారి కాంప్లెక్స్ హెచ్ ఎంలు, ఎంఇఓలు సీపారసు చేసిన వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఓక ఎస్జీటి, ఒక స్కూల్ అసిస్టెంట్ ను ఎంపిక చేయాలని అదేశాలు ఉన్నాయి. క్యాడర్ స్ట్రేంత్ కోసం  ఓక స్కూల్ అసిస్టెంట్ కు సమానంగా ఇద్ధరు ఎస్ జీటిలను ఎంపిక చేయాలని నిబంధన ఉంది. జిల్లాలోని మూడు సబ్ డివిజన్ లలో ఒక్కోక్క ఉర్ధు మీడియంకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ లేదా సెకండరి గ్రేడ్ టీచర్ ను ఎంపిక చేయాలని మండల విద్యాశాఖాధికారులకు అదేశాలు వచ్చాయి. కాని జిల్లాలో ఉన్న మండలాలకు గతంలో మాధిరిగా ఐతే 45 వరకు ఎంపిక చేసేవారు. ఎంఆర్ సిలు పెరుగకపోయిన కోత్త మండాలాల ప్రాతిపాధికన 70 వరకు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాల్సిన చోట కేజిబివిలు, మోడల్ స్కూల్స్ పేరిట వంద దాటించారు.

. . .  రెండోసారి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డా?

ఈసారి బెస్ట్ టీచర్ అవార్డు ఎంపికకు మండల, డివిజన్ ,జిల్లాస్థాయి కమిటీలు పరిశీలించి అర్హులైన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాల్సింది పోయి కొంతమంది ఎంఈఓ వారికి నచ్చిన మెప్పించిన వారికి ఎంపిక చేసి జిల్లా విద్యాశాఖ కు పంపడం జరిగింది అనే విమర్శలు ఉన్నాయి. దాంట్లో చాలామంది మండల స్థాయిలో ఎంపికైన వారు. గతంలో జిల్లా స్థాయిలో ఎంపికైన వారు మళ్లీ తెరపైకి వచ్చింది. సిరికొండ మండలంలో మండల స్థాయిలో అవార్డు తీసుకొని మళ్లీ రెండోసారి జిల్లా స్థాయిలో ఎంఈఓ పంపించడం ఏంటి అని చర్చ జరుగుతుంది. ఉపాధ్యాయ సంఘం లీడర్లుగా స్కూల్ ముఖం చూడని వారు ఉత్తమ జిల్లా ఉపాధ్యాయ అవార్డుల లీస్ట్ లో పెరు ఎలా అని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నటువంటి వారు సర్వీసులో అనేక సేవలందించిన వారు ఉన్నప్పటికీ  ఒక్కరిని కుడా ఎంపిక చేయలేదు అని తెలిసింది. ఒ ఉపాధ్యాయ సంఘం నాయకులు తమ యూనియన్ లో ఉన్నవారికి ఎక్కువమందికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు లీస్ట్ లో పెట్టించారు అనే ఆరోపణలు ఉన్నాయి.

More articles

Latest article