25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వర్గ పోరాటాల ద్వారా మాత్రమే దోపిడీ లేని సమాజం ఏర్పడుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

 . . .  కార్ల్ మార్క్స్ జయంతి వేడుకలలో సిపిఎం పిలుపు

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

ఒక వ్యక్తి ని ఇంకో వ్యక్తి దోపిడీ చేయకుండా శ్రమకు తగ్గ ఫలితం అందరికీ సమాన అవకాశాలు లభించాలంటే వర్గ పోరాటాలు ద్వారా మాత్రమే సమ సమాజం నిర్మితమవుతుంది అని కారల్ మార్క్స్ నమ్మారని  సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా మంగళవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ …

A society free from exploitation can only be created through class struggle

కారల్ మార్క్స్ రాసిన గ్రంథాల ఆధారంగా ప్రపంచంలో అనేక దేశాల్లో వర్గ పోరాటాలు జరిగి సోషలిస్ట్ వ్యవస్థ  ఏర్పడిందని , ఆయన రచనలు అనే కార్తిక సమస్యలకు మార్గం చూపుతున్నాయని ఆయన అన్నారు. సోషలిస్ట్  వ్యవస్థ కు మార్క్సిజమే పరిష్కారమని రుజువైందని ఆయన తెలిపారు. అందువల్ల కారల్  మార్క్స్ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన గొప్ప వ్యక్తి అని తెలిపారు. కార్ల్ మార్క్స్ సూచన మేరకు భారతదేశంలో వర్గ పోరాటాల ద్వారా మాత్రమే దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మించవచ్చు అని సిపిఎం పార్టీ భావించి అనేక ప్రజా ఉద్యమాలను వర్గ పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ వర్గ పోరాటాలు ప్రజలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం, అధ్యక్షుడు నర్సారెడ్డి , విజయ మాల, నగర నాయకులు అంజయ్య చక్రి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article