29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

చికిత్స పొందుతూ వివాహిత మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్. బతుకమ్మ :

 

తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన షెట్‌పల్లి మంజుల(25) అనే వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ నెల 13 న ఇంటి ముందు ఉన్న టిన్ షెడ్‌లో పరాక్వాట్ అనే కలుపు మందు సేవించినట్లు ఎస్ఐ తెలిపారు. కలుపు నివారణ మందు సేవించిన మంజులను చికిత్స నిమిత్తం కామారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తిరిగి బాధితురాలని కామారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రికి  తీసుకు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలి తండ్రి తూర్పు దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

More articles

Latest article