29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన ఆర్డీవో కార్యాలయ భవనం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో సుమారు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చిత్త శుద్దితో పని చేయాలన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి, పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సేవా కేంద్రాలుగా పని చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అనంతరం నూతన ఆర్డీఓ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ-జుక్కల్ పరిధిలో ఉన్న మండలాల ప్రజలకు అందుబాటులో ఉండి, ఆ ప్రాంత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జగిత్యాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీఎస్పీ విట్టల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, గ్రామాల సర్పంచ్ లు, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Inauguration of new RDO office building

More articles

Latest article