29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న ఒకరిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ విలాస్ కుమార్ తెలిపారు. నగర శివారులోని మాలపల్లి ప్రాంతానికి చెందిన సోహెబ్ ఖాన్ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడన్న సమాచారం మేరకు ఖానాపూర్ గ్రామంలోని జన్నపల్లి రోడ్డులోని రైల్వే గేటు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 2.1కేజీల గంజాయి, ద్వి చక్ర వాహనం, మొబైల్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నిజామాబాద్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ సింధు,  సిబ్బంది కిరణ్ కుమార్, గోపి, నర్సయ్య చారీ, నీలీరాజు, సాగర్రావు, సుధీర్, దశ పాల్గొన్నారు.

More articles

Latest article