25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హాస్టళ్లను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంతో పాటు, తెలంగాణ ఆదర్శ కళాశాల వసతి గృహాన్ని మండల ప్రత్యేక అధికారిణి, ఎల్లారెడ్డి ఎడిఎ రత్నం స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ రావు, ఎంపీడీవో ప్రభాకర్ చారీ లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినీల తరగతిగది సామర్థ్యాలను పరిశీలించారు. భోజనం మెనూ పరిశీలించారు. రెండు వసతి గృహాల్లో విద్యార్థినీలతో మాట్లాడి విద్యార్ధినీలకు కావలసిన మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్ల సౌకర్యం నీటి సదుపాయం వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీలకు ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే తమ వైద్య ఆరోగ్య సిబ్బందికి తెలియపరచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందజేసే కూరగాయలు, బియ్యం తదితర సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని వసతి గృహ వార్డెన్ లకు సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ మహమ్మద్, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ గీత, ఆదర్శ పాఠశాల వసతి గృహ వార్డెన్ తదితరులున్నారు.

Mandal Special Officer who inspected the hostels

More articles

Latest article