మంచిప్ప 21ప్యాకేజీ పనులు పూర్తిచేసి నీళ్లు అందించాలి
అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంచిప్ప 21 ప్యాకేజీ పనులు పూర్తిచేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని 84 వేల ఎకరాలకు నీళ్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్ఆర్ భవన్ కోటగల్లి నిజామాబాద్ ప్రెస్ మీట్ లో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సెగ్మెంట్ కు...