నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : హైదరాబాద్ మల్కాజిగిరి నివాసుడైన కేతావత్ పరుశురామ్ పోలీస్ 100 ఫోన్ కాల్ ను దుర్వినియోగం చేసిన నేరానికిగాను నాలుగు రోజుల జైలుశిక్షను విదిస్తూ నిజామాబాద్ రెండవ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నూర్జహన్ బేగమ్ సోమవారం తీర్పు చెప్పారు. ధర్పల్లి మండలం డి బి తాండాకు చెందిన బంధువుల ఇంటికి వచ్చిన పరుశరామ్, బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పదే పదే 100 కాల్ చేసి దుర్వినియోగం చేసినట్లు తన నేరాంగీకారంలో తెలిపాడు. ముద్దాయి 100 పోలీస్ డయల్ తప్పుడు సమాచారం ఇచ్చి ఫోన్ చేసినట్లు నేరంగీకారం ప్రకటనను నమోదు చేసిన కోర్టు అతనకి నాలుగు రోజుల జైలుశిక్షను విధించింది. కోర్టు జారీ చేసిన కన్విక్షన్ వారెంట్ స్వీకరించిన ధర్పల్లి కోర్టు కానిస్టేబుల్ అసిఫ్ నిజామాబాద్ సెంట్రల్ కారాగారానికి తరలించి జైలు అధికారులకు అప్పగించారు.
