డయల్ 100 దుర్వినియోగం చేసిన ఒకరికి జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : హైదరాబాద్ మల్కాజిగిరి నివాసుడైన కేతావత్ పరుశురామ్ పోలీస్ 100 ఫోన్ కాల్ ను దుర్వినియోగం చేసిన నేరానికిగాను నాలుగు రోజుల జైలుశిక్షను విదిస్తూ నిజామాబాద్ రెండవ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నూర్జహన్ బేగమ్ సోమవారం తీర్పు చెప్పారు. ధర్పల్లి మండలం డి బి తాండాకు చెందిన బంధువుల ఇంటికి వచ్చిన పరుశరామ్, బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పదే పదే 100 కాల్ చేసి దుర్వినియోగం చేసినట్లు తన నేరాంగీకారంలో తెలిపాడు. ముద్దాయి 100 పోలీస్ డయల్ తప్పుడు సమాచారం...