కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు, కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ ను శనివారం నిర్వహిస్తున్నామని, ఒలంపిక్ డే లో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్, కన్వీనర్ పి.అనిల్ కుమార్ మాట్లాడుతూ జూన్ 20న ఉదయం 8.30 నుండి 10.30 వరకు, బాయ్స్ హై స్కూల్ నుండి శిశుమందిర్ హై స్కూల్ వరకు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఒలంపిక్ డే రన్ 2026 ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరౌతున్నారని, ప్రతీ ఒక్కరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించి, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెంబర్స్ సందీప్, మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్య, బాయ్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ మాధవి, కరుణశ్రీ, గోవర్ధన్, ఎస్ జిఎఫ్ సెక్రటరీ హీరాలాల్, రసూల్, వెంకటి, అతీకుల్లా, అశోక్, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, నరేష్ రెడ్డి, సంతోష్, విజయ్ కుమార్, శివ, పిడి లు, పిఈటి లు తదితరులు పాల్గొన్నారు.
