30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రిపల్స్ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థి సంఘాల వినతి

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిపల్స్ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం బిచ్కుంద మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా బిచ్కుంద పట్టణంలో రిపల్స్ విద్యాసంస్థ కొనసాగుతోందని తెలిపారు. మొదట్లో ఈ సంస్థ బిచ్కుంద పట్టణంలో అద్దె భవనంలో నిర్వహించబడిందని, అనంతరం కందర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టి విద్యాసంస్థను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థ నిర్వహిస్తున్న స్థలానికి డిటిసిపి అనుమతి, లే ఔట్ పర్మిషన్, ఇతర సంబంధిత అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. భవిష్యత్‌లో సంస్థకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థ యాజమాన్యంతో మాట్లాడి స్థలాన్ని చట్టబద్ధం చేయాలని, లేదంటే సంస్థ నిర్వహణను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్. బాలరాజ్, టిఎస్ పి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article