రాజంపేట్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం తలమడ్లకు చెందిన సావుసాని శ్యాంసుందర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డారు.

శ్యాంసుందర్ రెడ్డి రాజంపేట్ మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని శ్యాంసుందర్ రెడ్డి ఫోన్ కొద్ది నిమిషాలకే స్వీచ్చాఫ్ రావడంతో తండ్రి కృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. వారి వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న రూంలో ఉరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు రాజంపేట్ పోలీసులకు సమాచారం అందించారు.

