. . . నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డా. శరణ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచేందుకు అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తున్నామని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ గైనకాలజిస్ట్ డా. శరణ్య తెలిపారు. బుధవారం మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.శరణ్య మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా, రొమ్ములో గడ్డ, ఆకారం లేదా పరిమాణంలో మార్పులు, చనుమొన నుంచి అసాధారణ స్రావం, చర్మంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రతి మహిళ క్రమం తప్పకుండా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడంతో పాటు, వయస్సు, వైద్యుల సూచన మేరకు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉన్న మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని డా. శరణ్య సూచించారు. “అవగాహన – ముందస్తు గుర్తింపు – సకాలంలో చికిత్స.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై పోరాటంలో ఇవే కీలకం” అని డా. శరణ్య పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ మహిళల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను కొనసాగీస్తుందని తెలిపారు
